Suriya46: కావాలని మరీ ఫ్యామిలీ డ్రామాను ఎంచుకున్న సూర్య

తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) గత కొన్ని సినిమాలుగా వరుస డిజాస్టర్లు అందుకుంటున్నారు. రీసెంట్ గా వచ్చిన రెట్రో(Retro) కూడా ఫ్లాపుగా నిలవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని మంచి కసితో ఉన్నారు సూర్య. అందులో భాగంగానే టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri)తో తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేసి ప్రస్తుతం ఆ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు సూర్య.
సూర్య కెరీర్లో 46వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఓ ఫ్యామిలీ డ్రామా అని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టరే వెల్లడించారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ అట్లూరి తాను సూర్యకు మూడు డిఫరెంట్ స్క్రిప్ట్స్ ను వినిపించానని, ఓ బయోపిక్, ఫ్యామిలీ డ్రామా మరియు హీస్ట్ థ్రిల్లర్ స్టోరీలను చెప్పగా అందులో సూర్య ఫ్యామిలీ డ్రామాను సెలెక్ట్ చేసుకున్నారని అన్నారు.
సూర్య కెరీర్లో ఇది మంచి కమర్షియల్ సినిమా అవుతుందని వెంకీ చెప్పగా, అది విన్నాక థ్రిల్లర్ లేదా బయోపిక్ కథను ఎంచుకోకుండా ఫ్యామిలీ డ్రామాను ఎంచుకున్నందుకు సూర్య ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నరు. ఒకప్పుడు వరుస సక్సెస్ లతో కలెక్షన్స్ పరంగా టైర్1 హీరోలో లిస్టు లో ఉన్న సూర్య మార్కెట్ ఇప్పుడు వరుస ఫ్లాపుల కారణంతో తగ్గుతూ వస్తుంది. ఎలాగైనా సూర్య ప్రస్తుతం చేస్తున్న సూర్య46(Suriya46), కరుప్పు(Karuppu) సినిమాలతో హిట్ అందుకుంటే తప్పించి మళ్లీ అతనికి పూర్వ వైభవం దక్కేలా లేదు.