Suriya: అగరం స్టూడెంట్స్ ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న సూర్య
కోలీవుడ్ హీరో సూర్య(Suriya) అగరం అనే ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదలకు విద్యా దానం చేస్తుంటారనే విషయం తెలిసిందే. అన్ని దానాల్లోకెల్లా విద్యా దానం గొప్పదంటారు. అలాంటి విద్యను ఉచితంగా అందిస్తూ ఎంతో మంది పేదల కోరికను తీరుస్తున్న సూర్యను అగరం ఫౌండేషన్(Agaram foundation) మొత్తం దేవుడిలానే కొలుస్తారు. అగరం స్థాపించి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా రీసెంట్ గా చెన్నై(Chennai)లో ఓ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ ఈవెంట్ కు శివ కుమార్(Siva kumar), సూర్య, జ్యోతిక(jyothika), కార్తి(karthi)తో పాటూ కమల్ హాసన్(kamal hassan), జ్ఞానవేల్ రాజా(gnanavel raja), వెట్రిమారన్(Vetrimaran) మరికొందరు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో సూర్య మాట్లాడుతూ, విద్యే ఆయుధమని అగరం నమ్ముతుందని, ఇవాళ ఆ నమ్మకమే నిజమైందని ఎమోషనల్ అయిన సూర్య, విద్య కేవలం చదువు మాత్రమే కాదని, అది మన సంప్రదాయాన్ని నేర్పించేదని సూర్య అన్నారు.
ఇప్పటికే అగరం ద్వారా 8000 వేల మంది ఉన్నత చదువులు చదువుకోగా అందులో 1800 మంది ఇంజనీర్లుగా మంచి పొజిషన్లలో ఉన్నారు. ఈ ఫౌండేషన్ ఇన్నేళ్లలో ఏకంగా 51 మంది డాక్టర్లను తయారు చేయగా వారిని చూస్తూ సూర్య ఎమోషనల్ అవగా, ఆ స్టూడెంట్స్ మాట్లాడుతున్న మాటలకు సూర్య కన్నీళ్లు పెట్టుకున్నారు. దీన్ని చూసి నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవుడివంటూ సూర్యను ఉద్దేశించి సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు.







