Suriya: విశ్వనాథన్ సన్స్ కోసం సూర్య ప్రాక్టీస్

కోలీవుడ్ టాలెంటెడ్ అండ్ స్టార్ హీరో సూర్య(Suriya)కు గత కొన్ని సినిమాలుగా ఏం చేసినా కలిసి రావడం లేదు. ఆయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుస ఫ్లాపులవుతున్నాయి. దీంతో తన ఆశలన్నీ వెంకీ అట్లూరి(Venky Atluri)తో చేస్తున్న సినిమాపైనే పెట్టుకున్నాడు సూర్య. ఆల్రెడీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి, రీసెంట్ గా ఓ భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.
ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాతి షెడ్యూల్ త్వరలోనే మొదలవనుందని తెలుస్తోంది. నెక్ట్స్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనుండగా, ఈ సీన్స్ కోసం సూర్య స్టంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు విశ్వనాథన్ అండ్ సన్స్(Viswanathan and sons) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. మరి టైటిల్ విషయంలో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది.
సూర్య సరసన మమిత బైజు(Mamitha Baiju) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash) సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara entertainments)బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రానున్నాయని సమాచారం. మరి ఈ సినిమా అయినా సూర్య ఆశలను నెరవేరుస్తుందేమో చూడాలి.