సీక్వెల్‌కి రెడీ అవుతున్న సూర్య?
తమిళ్‌తోపాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూర్యకు ఈమధ్యకాలంలో సరైన హిట్ లేదు. వరసగా అన్నీ పరాజయాల్నే చవిచూస్తున్నాడు. సూర్య, కె.వి.ఆనంద్ కాంబినేషన్లో వచ్చిన `బందోబస్త్` భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఫరవాలేదు అనిపించుకుంది. వీరిద్దరి కాంబినేషన్లోనే గతంలో `వీడొక్కడే`, `బ్రదర్స్` చిత్రాలు వచ్చాయి. అయితే వీటిలో `వీడొక్కడే` మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ చెయ్యాలని కె.వి.ఆనంద్ భావిస్తున్నాడట.
అయితే ప్రస్తుతం సూర్య తను చేసే ప్రాజెక్ట్స్‌తో చాలా బిజీగా ఉన్నాడు. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న `ఆకాశం నీ హద్దురా` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో లాక్డౌన్ విధించడంతో రిలీజ్ వాయిదా పడింది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేస్తారు. ఈ సినిమా తర్వాత సింగం సిరీస్‌తో తనకు ఎంతో పేరు తెచ్చిన డైరెక్టర్ హరితో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. అలాగే `అసురన్` దర్శకుడు వెట్రిమారన్‌తో ఓ సినిమా అంగీకరించాడు సూర్య. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత సూర్య, కె.వి.ఆనంద్ కాంబినేషన్లో `వీడొక్కడే` చిత్రానికి సీక్వెల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.













