కార్తీ ‘దేవ్’ ఫస్ట్ లుక్ విడుదల
కార్తీ హీరోగా నటిస్తున్న చిత్రం దేవ్. రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రకుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రాని నాయికగా నటిస్తున్నారు. ఖాకీ హిట్ తర్వాత కార్తీ, రకుల్ కలిసి నటిస్తున్న చిత్రమిది. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. చెన్నై, హైదరాబాద్, ముంబై, హిమాలయాస్ వంటి ప్రదేశాల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ చివరిదశలో ఉంది.ప్రిన్స పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. తెలుగు హక్కులను ఠాగూర్ మధు పొందారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది.













