#Suriya47: సూర్య 47 పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభం
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం మల్టీ ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. తన 47వ చిత్రం కోసం ‘ఆవేశం’ ఫేమ్ మలయాళ ఫిల్మ్ మేకర్ జితు మాధవన్ తో కలిసి పనిచేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం అత్యంత ఎదురుచూస్తున్న అనౌన్స్మెంట్స్ లో ఒకటిగా నిలిచింది, అభిమానులు, ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ కథానాయికగా నటించగా, విజయవంతమైన చిత్రాలతో అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ నస్లెన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. జఘరమ్ స్టూడియోస్ ఈ ప్రాజెక్టు కు మద్దతు ఇస్తోంది.
#సూర్య47 ఈరోజు చెన్నైలో సాంప్రదాయ పూజా కార్యక్రమంతో అధికారికంగా లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలో చిత్ర తారాగణం, సిబ్బంది , పరిశ్రమ నుండి అనేక మంది శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
ఈ వేడుకకు చిత్ర నిర్మాత శ్రీమతి జ్యోతిక, నటుడు కార్తీ, రాజశేఖర్ పాండియన్ (2D ఎంటర్టైన్మెంట్), నిర్మాతలు S.R. ప్రకాష్, S.R. ప్రభు (డ్రీమ్ వారియర్ పిక్చర్స్) వంటి విశిష్ట అతిథులు హాజరయ్యారు, వీరందరూ సినిమా విజయానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
పూజ తర్వాత, చిత్రీకరణను ప్రారంభించారు, అధికారికంగా మొదటి షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభమైయింది.
దర్శకుడు జితు మాధవన్ మాట్లాడుతూ.. కొత్త పరిశ్రమ, కొత్త ప్రారంభం, అది కూడా సూర్య లాంటి స్టార్‌తో.. ఇది మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. మేము కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. మేము అందించాలనుకుంటున్న ఫ్రెస్ నెస్ ని ప్రేక్షకులు అంగీకరించి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.”
జాన్ విజయ్, ఆనందరాజ్, అనేక మంది ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో వినీత్ ఉన్ని పలోడే సినిమాటోగ్రఫీ, సుషిన్ శ్యామ్ సంగీతం, అశ్విని కాలే ప్రొడక్షన్ డిజైన్, అజ్మల్ సాబు ఎడిటర్. చేతన్ డి సౌజా స్టంట్ మాస్టర్.
త్వరలోనే మేకర్స్ నుంచి మరిన్ని ఎక్సయిటింగ్ అప్డేట్లు రానున్నాయి.






