Suriya46: నెగిటివ్ షేడ్స్ రోల్ లో సూర్య?

తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) ఎంత గొప్ప నటుడనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ రకమైన పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే సూర్యకు గత కొన్ని సినిమాలుగా పరాజయాలే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం సూర్య చేతిలో రెండు సినిమాలుండగా అందులో టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఒకటి. సూర్య వెంకీతో చేస్తున్న ఈ సినిమా అతని కెరీర్లో 46వ మూవీగా రూపొందుతుంది.
ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా గురించి రోజుకో వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్ కు రెండు యాంగిల్స్ ఉంటాయని, అందులో ఒకటి నెగిటివ్ షేడ్స్ ఉంటాయని, ఆ క్యారెక్టర్ కోసం వెంకీ అట్లూరి సూర్యకు స్పెషల్ లుక్ ను డిజైన్ చేశాడని వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది.
ప్రస్తుతం వెంకీ అట్లూరి ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తుండగా, ఆ యాక్షన్ సీక్వెన్స్ మొత్తం సినిమాలోనే హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఇప్పటికే డైరెక్టర్ తో కలిసి జీవీ ప్రకాష్(GV Prakash) మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రేమలు(premalu) ఫేమ్ మమిత బైజు(Mamitha baiju) హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమా అయినా సూర్యకు మంచి ఫలితాన్నిచ్చి అతన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.