Suriya: సూర్య కోసం భారీ సెట్
తమిళ హీరో అయినా సూర్య(Suriya)కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. తెలుగు హీరోలకు ఈక్వల్ గా ఆయనకు ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో సూర్య డైరెక్ట్ తెలుగులో ఎప్పుడెప్పుడు మంచి సినిమా చేస్తాడా అని అందరూ ఎంతగానో వెయిట్ చేస్తుండగా, వెంకీ అట్లూరి(Venky Atluri) చెప్పిన కథకు ఓకే చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూర్య. లక్కీ భాస్కర్(Lucky baskhar) సినిమాతో మంచి హిట్ అందుకున్న తర్వాత వెంకీ చేస్తున్న సినిమా ఇదే.
అయితే ఈ సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ కోసం మేకర్స్ ఓ భారీ సెట్ ను వేయిస్తున్నారు. జూన్ నుంచి రెండు వారాల పాటూ జరగనున్న యాక్షన్ సీక్వెన్స్ ను ఈ సెట్ లోనే షూట్ చేయనున్నాడట వెంకీ అట్లూరి. ఈ యాక్షన్ సీక్వెన్స్ ను ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్(Peter Heins) కొరియోగ్రఫీ చేయనున్నట్టు తెలుస్తోంది. సినిమా మొత్తానికి ఈ యాక్షన్ సీక్వెన్స్ ఓ హైలైట్ గా నిలవనుందని సమాచారం.
అలా అని ఇది యాక్షన్ మూవీ కాదట. సూర్యతో వెంకీ చేయబోతున్న సినిమా ఓ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు మిస్టర్ బచ్చన్(Mr.Bachan) భామ భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sri Borse)ను తీసుకుందామనుకున్నారు కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లోకి కాయదు లోహర్(Kayaadhu Lohar) వచ్చిందని అంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్(sithara Entertainments) బ్యానర్ లో నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్(GV Prakash) సంగీతం అందించనున్నాడు.






