కోలీవుడ్ సింగంతో టాలీవుడ్ సింహం
సిల్వర్ స్క్రీన్ పై రికార్డులు కొట్టడమే కాదు, ఓటీటీలో టాక్ షోతో కూడా మంచి రికార్డులు క్రియేట్ చేయగలనని ప్రూవ్ చేశాడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna). బాలయ్య(Balaiah)తో టాక్ షో చేయాలనే ఆలోచన వచ్చినప్పుడే ఆహా(Aha) టీమ్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్(Unstoppable) ఇప్పుడు నాలుగో సీజన్ కు రెడీ కాబోతుంది.
ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌ను ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి (AP CM Nara Chandra Babu Naidu)తో ఇప్పటికే షూట్ చేశారు. దానికి సంబంధించిన ప్రోమో ఆల్రెడీ రిలీజై నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక రెండో ఎపిసోడ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) మరియు కంగువ(Kanguva) చిత్ర యూనిట్ తో కలిసి చేస్తున్నారు. తమిళ హీరోనే అయినప్పటికీ సూర్యకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది.
నవంబర్ 14న కంగువ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూర్య అన్‌స్టాపబుల్ షోకు వచ్చాడు. సింగంగా ఆడియన్స్ తో విజిల్స్ వేయించిన సూర్య, టాలీవుడ్ నటసింహంతో కలిసి ఏమేం కబుర్లు చెప్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మరింది. సూర్యతో పాటూ బాబీ డియోల్(Bobby deol), కంగువ డైరెక్టర్ శివ(Kanguva Director Siva) కూడా ఈ షోలో పాల్గొననున్నారు. మొత్తానికి ఆహా టీమ్ ఈ సీజన్ కోసం పాన్ ఇండియా సెలబ్రిటీస్ ను టార్గెట్ చేస్తున్నట్లు అర్థమవుతుంది.













