సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఆరు చిత్రాలు
మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది సురేష్ ప్రొడక్షన్స్. ప్రస్తుతం దాదాపుగా ఆ సంస్థ నుంచి డజను చిత్రాలు వరుసలో ఉన్నాయి. వాటిలో అరడజను చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో వ్యవహరిస్తారు నిర్మాత సురేష్‌బాబు. ఆ నమ్మకంతోనే ఆయన తాజాగా ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సమంత నటించే ఓ బేబీ, అల్లు శిరీష్ నటించే ఏబీసీడీ, ఆనంద్ దేవరకొండ, శివాత్మిక చేస్తున్న దొరసాని, ఫలక్‌నుమాదాస్, మల్లేశం, శ్రీ విష్ణు, నివేదా థామస్ నటించే బ్రోచేవారెవరురూ వంటి చిత్రాలన్నీ సురేశ్‌బాబు సహకారంతో విడుదల కానున్నాయి. సురేశ్ బాబు బ్యాకప్‌లో ఈ సినిమాలు అన్నిటికీ అలాంటి మంచి థియేటర్లు, మంచి రిలీజ్ డేట్ దొరికాయి.













