కండలవీరుడుకు సుప్రీంలో ఊరట
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దేశ వ్యాప్తంగా ఆయనపై నమోదైన ఆరు కేసుల్లో విచారణను నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. వాల్మీకి సమాజాన్ని అవమానించాడని ఆరోపిస్తూ సల్మాన్‌పై పలు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విచారణ నిలిపివేయాలని కోరుతూ సల్మాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు తదుపరి ఆదేశాలు వెలువడే వరకు విచారణను నిలుపుదల చేయాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సల్మాన్‌ఖాన్‌పై ఎలాంటి కేసులు నమోదు చేయరాదని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు.













