లవ్ యాత్రికి సుప్రీం గ్రీన్ సిగ్నల్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు చెందిన కంపెనీ నిర్మిస్తున్న లవ్యాత్రి సినిమాకు సుప్రీంకోర్టు నుంచి అభయహస్తం లభించింది. సల్మాన్ కంపెనీ సృజనాత్మక శక్తిని అడ్డుకునే ప్రసక్తి లేదని కోర్టు తెలిపింది. వాస్తవానికి లవ్‌రాత్రి అనే టైటిల్‌తో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఆ తర్వాత నిర్మాత సల్మాన్‌కు కూడా హెచ్చరికలు వచ్చాయి. సల్మాన్‌ను చంపేందుకు కుట్ర జరిగిందని ఆయన తరపున లాయర్ నిజామ్ పాషా కోర్టుకు తెలిపారు. లవ్‌రాత్రి టైటిల్‌ను ప్రజలు నవరాత్రిగా భావిస్తున్నారన్న ఉద్దేశంతో ఆ టైటిల్‌ను లవ్‌యాత్రిగా మార్చామని లాయర్ పాషా కోర్టుకు విన్నవించారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసులో ఫిర్యాదులు నమోదు చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. కేసును మరో నాలుగు వారాలకు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.













