పద్మావతికి లైన్ క్లియర్
దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించిన హిందీ చలనచిత్రం పద్మావతి విడుదల కాకుండా స్టే ఇవ్వాలన్న పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ సినిమాకు ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. పద్మావతి సినిమా సెన్సార్ బోర్డు ముందుకు వచ్చిందా? సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారా? అనే విషయాలపై న్యాయమూర్తులు ఎఎం ఖాన్విల్కర్, డివై చంద్రచూడ్ పిటిషనర్ల తరపున హాజరైన న్యాయవాదులను ప్రశ్నించారు. ఇప్పటివరకూ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని తేలియడంతో, ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయస్థానం తన అధికారాలను వినియోగించలేదని ధర్మాసనం సృష్టం చేసింది.













