పద్మావత్ ను ఆపలేం
పద్మావత్ ప్రదర్శనను నిలిపివేయాలని వేసిన పిటీషన్లను సుప్రీంకోర్టు మళ్లీ తిరస్కరించింది. ఆ చిత్రాన్ని బ్యాన్ చేయలేమని ఇవాళ కోర్టు మళ్లీ సృష్టం చేసింది. ఆయా రాష్ట్రాలు ఆ ఫిల్మ్‌ను ప్రదర్శించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. శాంతిభద్రత సమస్యలు ఉత్పన్నమయ్యే నేపథ్యంలో పద్మావత్‌ను రద్దును చేయాలని రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఈ రకంగా స్పందించింది. దీనికి బదులుగా సినిమా చూడవద్దు అని ప్రజలకు సలహా ఇవ్వాలంటూ కోర్టు తన తీర్పులో ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. పద్మావత్‌ను వ్యతిరేకిస్తున్న కర్ణిసేనకు కూడా ఈ విషయాన్ని చేరవేయాలంటూ కోర్టు తెలిపింది. సినిమా రిలీజ్‌కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరీ ఉత్కంఠంగా మారింది. రాజ్‌పుత్ సంఘాల బెదిరింపుల నేపథ్యంలో ఈ సినిమాను బ్యాన్ చేయాలని గుజరాత్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి.













