ఎన్నాళ్లకు ఎన్నేళ్లకు ఈ కాంబినేషన్!
ఎన్నాళ్లకు ఎన్నేళ్లకు ఈ కాంబినేషన్ వస్తుంది! ప్రపంచ వ్యాప్తంగా పైన ఫొటోలో వున్నా హీరోల గురించి తెలియనివారు వుండరన్నది అతిశయోక్తి కాదు. ఆ కాంబినేషన్ నిజం కాబోతుంది. రజినీకాంత్ మరియూ కమల్ హాసన్ కాంబినేషన్ లో చాలా కాలం తర్వాత మళ్లీ ఓ సినిమా రాబోతుంది. అయితే ఇంతకీ ఆ సినిమాకు డైరెక్టర్ ఎవరు? అసలు వారు ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమాకు కథ ఏ జోనర్? కథ ఎలావుండ్తుంది అన్నది పక్కన పెడితే, ఇక అసలు విషయానికి వస్తే.. కమల్ హాసన్, రజినీకాంత్ తమిళ సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటివారు. 1985 లో వచ్చిన హిందీ చిత్రం ‘గిరఫ్తార్’ తరువాత వీళ్ళ కాంబినేషన్ లో మళ్ళి చిత్రం రాలేదు. దాదాపు ఒకే సమయంలో కెరీర్ మొదలుపెట్టిన వీరు దేశం మెచ్చిన హీరోలుగా ఎదిగారు. కెరీర్ బిగినింగ్ లో దిగ్దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వంలో అధ్బుతమైన చిత్రాల్లో కలిసి నటించారు. అయితే ఈ ఇద్దరికీ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
అందుతున్న సమాచారం ప్రకారం.. చాలా కాలం తరువాత మళ్ళీ వారిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తోంది అని తెలుస్తోంది. అయితే అందులో కమల్ హాసన్ నటించడట. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. కమల్ హాసన్ నిర్మాణంలో రజిని కాంత్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషల్ పతాకంపై రజని హీరోగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.అయితే ఈ సినిమాకు “ఖైదీ” మూవీ ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారని సమాచారం ఇప్పటికే లోకేష్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన “ఖైదీ” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమా నచ్చిన ఇళయదలపతి విజయ్ లోకేష్ కు అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం విజయ్ హీరోగా “మాస్టర్” అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే రజినీకాంత్ శివ దర్శకత్వంలో “అన్నాత్తై” అనే సినిమాలో, కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో “ఇండియన్ 2” అనే సినిమాలో నటిస్తున్నాడు.













