అభిమానులతో రజనీకాంత్ సమావేశం
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులతో సమావేశం అయ్యారు. నేటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ఆయన అభిమానులతో విడతలవారీగా భేటీ అవుతారు. అభిమానులతో సెల్ఫీలు దిగేందుకు ప్రత్యేకంగా రజనీకాంత్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు రజనీకాంత్ అభిమానులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారినుద్దేశించి మాట్లాడుతూ తన భవిష్యత్తును ఆ భగవంతుడే నిర్ణయిస్తాడని అన్నారు. అభిమానుల ఆకాంక్షలను ఎట్టి పరిస్థితుల్లోనై వమ్ము చేయనన్నారు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా 1996లో డీఎంకేకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం తన పేరును వాడుకున్నారని అన్నారు. 21 ఏళ్ల క్రితమే రాజకీయాల్లో నాకు చేదు అనుభవం ఎదురైంది. నేను ఏ పార్టీలోనూ చేరను. నటనే నా వృతి, దేవుడు ఆదేశించాడు. ఆ పనే చేస్తాను. మీరు కూడా ఏ పార్టీకి మద్దతు ఇవ్వొద్దు. నా అభిమానులు నిజాయితీగా జీవించాలి. ఎలాంటి రాజకీయ అంశాలు మాట్లాడొద్దు అని అభిమానులకూ సూచించారు.













