55 వసంతాల తేనె మనసులు
కృష్ణ నట ప్రస్థానానికి నాంది పలికిన తేనె మనసులు చిత్రం విడుదలై మంగళవారానికి సరిగ్గా 55 ఏండ్లు పూర్తయ్యింది. 31-3-1965లో విడుదలైన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. ముళ్ళపూడి వెంకటరమణ కథ అందించిన ఈ చిత్రం అప్పట్లో విశేష ప్రేక్షకాదరణ పొందింది. అంతేకాదు శతదినోత్సవాన్ని జరుపుకున్న చిత్రం కూడా. కృష్ణ, రామ్మోహన్, సంధ్యారాణి, సుకన్య నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ 55 సంవత్సరాల సినీ ప్రమయాణంతో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా అన్నింటికి మించి ప్రయోగాలు చేసే డాషింగ్ హీరోగా, నిర్మాతగా కృష్ణ పేరు తెచ్చుకున్నారు. నా ఆల్‌టైమ్ ఫేవరేట్ సినిమా తేనె మనసులు. సమయంతో సంబంధంలేని ఓ క్లాసిక్. 55 ఏండ్ల క్రితం సూపర్‌స్టార్ కృష్ణ సినీ ప్రయాణం ఈ చిత్రంలోనే ఆరంభమైంది. బ్లాక్ బస్టర్ బిగినింగ్. మరొక్కసారి ఆ క్షణాల్లోకి వెళ్ళి వద్దాం అంటూ కృష్ణ తనయుడు మహేష్‌బాబు ట్వీట్ చేశారు.













