తారక్ ప్లానింగ్ సూపర్బ్
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు నేషనల్ లెవెల్ లో క్రేజ్ పెరిగింది. దీంతో నార్త్ డైరెక్టర్లు, నిర్మాతలు ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న ఎన్టీఆర్, ఆ సినిమాతో దేశ వ్యాప్తంగా సోలోగా గ్రాండ్ సక్సెస్ అందుకోనున్నాడని అందరూ అభిప్రాయపడుతున్నారు.
దేవర తో పాటూ ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్2 సినిమా చేస్తున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిసతున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమాను చేయనున్న విషయం తెలిసిందే. ఇది కాకుండా యష్ రాజ్ ఫిల్మ్స్ లోనే తారక్ సోలోగా మరో స్పై థ్రిల్లర్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. తారక్ బాలీవుడ్ లో ఓ ఏజెన్సీని తన ప్రచారం కోసం స్పెషల్ గా నియమించుకున్నాడట. తనకు సంబంధించిన బాలీవుడ్ సినిమా ఆఫర్లు, కమర్షియల్ యాడ్స్ అన్నీ కూడా ఇకపై ఆ ఏజెన్సీనే చూసుకోనుందట. బాలీవుడ్ లో తనతో సినిమాలు చేయాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారనే నేపథ్యంలో పక్కా ప్లానింగ్ తోనే తారక్ ఈ ఏజెన్సీని నియమించుకున్నట్లు తెలుస్తోంది.













