మహేశ్ బాబు 25వ చిత్రం ప్రారంభం
కృష్ణాష్టమి సందర్భంగా మహేశ్ బాబు 25 వ చిత్రం ప్రారంభమైంది. ఇవాళ ఆ మూవీ కి సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. స్పైడర్ మూవీ బిజీ షెడ్యూల్ వల్ల మహేశ్ పూజా కార్యక్రమాలకు హాజరు కాలేకపోయారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న ఈ మూవీ ని అశ్వినీదత్, దిల్ రాజు నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మహేశ్ కొడుకు గౌతమ్ క్లాప్ కొట్టగా, మహేశ్ గారాలపట్టి సితార కెమెరా స్విచ్ ఆన్ చేసింది. ఈ కార్యక్రమంలో మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్, దేవిశ్రీ ప్రసాద్, దిల్ రాజు, అశ్వనీదత్, రాఘవేంద్రరావు, వీవీవినాయక్, వంశీ పైడిపల్లి, గౌతమ్, సితార తదితరులు పాల్గొన్నారు.













