గుంటూరు కారంలో కృష్ణ కనిపిస్తాడా?
గుంటూరు కారం సినిమా మరో 8 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వినిపించినా ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మొన్న ట్విట్టర్ స్పేస్ లో నిర్మాత నాగవంశీ చెప్పిన స్పెషల్ న్యూస్ కు ఫ్యాన్స్ మరింత ఆనందపడుతున్నారు. నాగ వంశీ చెప్తున్న ప్రకారం గుంటూరు కారం సెకండాఫ్ లో ఇద్దరు సూపర్ స్టార్లు ఒకేసారి స్క్రీన్ పై కనిపించనున్నారట.
అంటే మహేష్ బాబుతో నటశేఖర కృష్ణ గారు కూడా గుంటూరు కారంలో కనిపిస్తారన్నమాట. మనం గతంలో చూసిన టెక్నాలజీ యొక్క అడ్వాన్డ్స్ వెర్షన్ ను గుంటూరు కారం కోసం మేకర్స్ వాడుతున్నారట. అప్పట్లో కలిసుందాం రా, యమదొంగ మూవీల్లో ఎన్టీఆర్ ను స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా చూపించినట్లే ఇప్పుడు గుంటూరు కారంలో కృష్ణ ను చూపించబోతున్నారట.
కాకపోతే త్రివిక్రమ్ ఈ సినిమాలో కృష్ణ కనిపించే విధానాన్ని కథతో ముడిపెట్టి భిన్నంగా ప్రెజెంట్ చేయనున్నాడట. దీంతో పాటూ మహేష్ సినిమాలకు అడ్డాగా చెప్పే సుదర్శన్ 35 ఎంఎం కూడా ఓ క్యారెక్టర్ గా రానుందట. ఇంతకీ గుంటూరులో మిర్చి బిజినెస్ చేసే వెంకట రమణారెడ్డికి, హైదరాబాద్కు ఉన్న కనెక్షన్స్ ఏంటన్నది తెలియాలంటే మాత్రం జనవరి 12 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్స్క్ జరుపుకుంటోంది.













