Officer On Duty: మలయాళం నుంచి మరో సూపర్ క్రైమ్ థ్రిల్లర్
మలయాళ థ్రిల్లర్ గా వచ్చిన దృశ్యం మూవీ ఇండియన్ సినీ చరిత్రలోనే భారీ సక్సెస్ను అందుకుంది. దృశ్యం(Drishyam) ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో తెరకెక్కి, కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. దృశ్యం సూపర్ హిట్ అవడంతో దృశ్యం2(Drishyam2) ను కూడా తీసి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. రీసెంట్ గా దృశ్యం3(Drishyam3)ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.
ఇప్పుడు మలయాళం నుంచి మరో క్రైమ్ థ్రిల్లర్ వచ్చింది. ఆఫీసర్ ఆన్ డ్యూటీ(Officer On Duty) అనే టైటిల్ తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ను అందుకుంది. కుంబాచో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చి మంచి టాక్ ను అందుకుంది. జిత్తు అష్రఫ్(Jithu Ashruf) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు.
నకిలీ బంగారు ఆభరణాల కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఓ సీఐకు అనుకోకుండా దాని వెనుక సెక్స్ రాకెట్, డ్రగ్స్ కేసులు బయటపడతాయి. కేసు ఇన్వెస్టిగేషన్ టైమ్ లో ఆయన పడే ఇబ్బందులేంటి? అసలు నకిలీ ఆభరణాల కేసుకి, డ్రగ్స్ కు సంబంధమేంటనే నేపథ్యంలో సినిమా మొత్తం సస్పెన్స్ తో ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుందంటున్నారు. ఇప్పటికే రూ.30 కోట్లు కలెక్ట్ చేసిన మలయాళ థ్రిల్లర్ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇదంతా చూసి మలయాళ థ్రిల్లర్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆఫీసర్ ఆన్ డ్యూటీ మంచి టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో ఆ సినిమాకు సీక్వెల్ ను ప్లాన్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది.













