సుహాస్ ఈ ఛాన్స్ ను ఎలా వాడుకుంటాడో!
టాలీవుడ్ లో కమెడియన్ గా కెరీర్ ను స్టార్ట్ చేశాడు యాక్టర్ సుహాస్. హీరో ఫ్రెండ్ పాత్రలతో మెప్పిస్తూ ఒక్కో అడుగు వేసుకుంటూ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా మంచి హిట్ అవడంతో సుహాస్ కు అవకాశాలు పెరిగాయి. ఓ వైపు కమెడియన్ పాత్రలు చేస్తూనే మరోవైపు హిట్-2 లాంటి సినిమాలో నెగిటివ్ రోల్ చేశాడు.
ఇప్పటికే నటుడిగా మంచి ప్రశంసలందుకున్న సుహాస్, తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. రైటర్ పద్మభూషణ్ తో హీరోగా మరో హిట్ అందుకున్న సుహాస్, రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. దీంతో లో బడ్జెట్ లో రియాలిటీకి దగ్గరగా ఉండే కథలకు సుహాస్ ఇప్పుడు కేరాఫ్ గా మారాడు.
ప్రస్తుతం సుహాస్ హీరోగా మూడు సినిమాలు రానున్నాయి. అందులో ఒకటి దిల్ రాజు బ్యానర్ అవడం విశేషం. హీరోగా ఛాన్సులు పెరుగుతుండటంతో సుహాస్ ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యాడట. సక్సెస్ వచ్చింది కదా అని కమర్షియల్ సినిమాలు, యాక్షన్ సినిమాలను ట్రై చేస్తే సుహాస్ ఫ్యూచర్ లో ఇబ్బంది పడటం ఖాయం. అలా కాకుండా కథల విషయంలో జాగ్రత్తలు వహిస్తూ డిఫరెంట్ స్టోరీస్ తో సినిమాలు చేసుకుంటూ వెళ్తే మాత్రం సుహాస్ కు మరింత భవిష్యత్తు ఉండే ఛాన్సుంది. మరి ఈ సదావకాశాన్ని సుహాస్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.













