సన్నీ లియోన్ కు అరుదైన గౌరవం
బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో ఈ మధ్యే ప్రారంభించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో సన్నీ మైనపు బొమ్మ కూడా కొలవుదీరనున్నది. ఇప్పటికే ఈ మ్యూజియంలో బాలీవుడ్ షెహన్షా అమితాబ్ బచ్చన్, ప్రధాని నరేంద్ర మోదీ మైనపు విగ్రహాలు ఉన్నాయి. దీనికోసం ఇప్పటికే సన్నీ కొలతలు కూడా తీసుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన మేడమ్ టుస్సాడ్స్ సిబ్బంది, 200కు పైగా కొలతలను తీసుకోవడం విశేషం. మేడమ్ టుస్సాడ్స్‌లోని మైనపు విగ్రహాలు జీవం ఉట్టిపడేలా ఉంటాయని పేరు. అందుకే అన్ని విషయాల్లో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. సన్నీ లియోన్‌కు ఇండియాతో పాటు విదేశాల్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియానూ ఆమె యాక్టివ్‌గా ఉంటుంది. తన విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని తెలియగానే సన్నీ తెగ ఆనందపడింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారికి కృతజ్ఞతలు తెలిపింది.













