అవి చెయ్యాలా వద్దా అనేది నాకు తెలుసు
నేనెవరినీ అవకాశాల కోసం ఇప్పటిదాకా అడిగింది లేదు. నా ఇమేజ్ చూసి, నాకున్న ఫాలోయింగ్‌ను చూసి, వాటన్నింటికీ మించి నాలోని టాలెంట్‌ను చూసి నాకు అవకాశాలిస్తున్నారు. అలా వచ్చే అవకాశాల నుంచి కొన్నింటిని నేను ఎంపిక చేసుకుంటున్నానంతే అని అంటోంది బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్. ఈ బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్లో భారీగా ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఈ మధ్య బాలీవుడ్లోనే కాదు సౌత్‌లోనూ అవకాశాలు వస్తుండడం విశేషం. ఈ సందర్భంగా సన్నీలియోన్ మాట్లాడుతూ నాకెలాంటి ఛాన్సులివ్వాలో దర్శకులకు తెలుసు. అవి చెయ్యాలా వద్దా అనేది నాకు తెలుసు అంటూ వింత సమాధానమిచ్చింది. బాలీవుడ్లో చాలా మంది సూపర్‌స్టార్స్ ఉన్నారు కదా. వాళ్లందరితో సినిమాలెప్పుడు? అని అడిగితే ఏమో వాళ్లకి నాతో సినిమా చేయాలనిపిస్తే ఖచ్చితంగా పిలుస్తారు. గతంలో షారుక్ సరసన నటించినట్లే మంచి ఛాన్స్ వస్తే మిగతా సూపర్‌స్టార్స్‌తో కూడా నటిస్తాను అని పేర్కొంది సన్నీలియోన్.













