సన్నీలియోన్ కు ముందస్తు బెయిల్
బాలీవుడ్ నటి సన్నీలియోనీకి ఈవెంట్ మేనేజ్మెంట్ చీటింగ్ కేసులో ఊరట లభించింది. ఈ కేసులో అరెస్టు చేయకుండా ఆమెతోపాటు ఆమె భర్త డేనియల్‌కు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 2019లో ప్రేమికుల దినోత్సవం రోజున కొచ్చిలో తాము ఏర్పాటు చేసిన ఈవెంట్లలో సన్నీలియోనీ పాల్గొంటానని చెప్పి అప్పట్లో తమ వద్ద నుంచి 29 లక్షలు తీసుకుందని, కానీ ఆమె మాత్రం పాల్గొనలేదని పేర్కొంటూ ఇటీవల ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈవెంట్ కంపెనీ ఫిర్యాదు మేరకు సన్నీలియోన్‌పై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. దీంతో కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను విచారించారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను బాలీవుడ్ బ్యూటీ ఖండించింది. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ సన్నీలియోనీ కేరళ హైకోర్టు ఆశ్రయించారు.













