సునీల్‌కు అన్యాయం చేసిన త్రివిక్రమ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన గుంటూరు కారం సినిమా టాక్ ఎలా ఉన్నా మహేష్ వన్ మ్యాన్ షో అని ఫ్యాన్స్ తెగ సంబరపడి పోతున్నారు. అయితే ఈ సినిమా చూశాక ఆడియన్స్, త్రివిక్రమ్ తన ఫ్రెండ్ సునీల్ కు అన్యాయం చేశాడంటున్నారు. గుంటూరు కారం సినిమాలో సునీల్ నటించాడన్న విషయం తెలిసిందే.
తన ఫ్రెండ్ కు మంచి పాత్ర ఇచ్చి ఉంటాడని భావించిన సునీల్ ఫ్యాన్స్ కు త్రివిక్రమ్ నిరాశే మిగిల్చాడు. ఈ సినిమాలో సునీల్ కేవలం ఒక్క సీన్‌కే పరిమితమయ్యాడు. సినిమా మొదట్లోనే జగపతి బాబు బ్రదర్ క్యారెక్టర్ లో సునీల్ కనిపించాడు. ఆ పాత్రను మొదట్లో ముగించాడు త్రివిక్రమ్. అసలు అలాంటి చిన్న రోల్‌కు సునీల్‌నే ఎందుకు తీసుకోవాలన్న ఆలోచన వచ్చిందోనని త్రివిక్రమ్ సెలెక్షన్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
తెలుగుతో పాటూ తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తున్న సునీల్ ను ఇలా ఒక్క సీన్‌కే పరిమితం చేయడం ఏం బాగోలేదంటూ త్రివిక్రమ్ ను ట్యాగ్ చేసి నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. త్రివిక్రమ్- మహేష్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజాలో సునీల్‌కు మంచి పాత్రలిచ్చిన త్రివిక్రమ్, గుంటూరు కారంలో మాత్రం సునీల్‌కు అన్యాయం చేశాడు.













