విలన్‌గా సునీల్
హాస్యనటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన సునీల్ కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన విలన్‌గా నటించబోతున్నారు. కమెడియన్ సుహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం కలర్‌ఫొటో. సందీప్‌రాజ్ దర్శకుడు. సాయిరాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సునీల్ విలన్‌గా నటించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ప్రతినాయకుడిగా సునీల్ ఎలా ఉంటారో ఈ సినిమాలో చూడబోతున్నారని ప్రకటించారు. చిత్ర ఫస్ట్‌లుక్‌ను హీరో నాని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. 1995లో ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కుతున్నది. మత్తు వదలరా ఫేమ్ కాలభైరవ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.













