సునీల్‌కు లక్కీ ఆఫర్
మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది సునీల్‌కి. దీనికితోడు పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్‌కు అతను బాల్య స్నేహితుడు. అన్నీ అలా కలిసి వచ్చి డైరెక్టర్ క్రిష్, స్టార్ హీరో పవన్‌కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో సునీల్‌కు మంచి అవకాశం వచ్చింది. హీరో వేషాలు వదిలి కమేడియాన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాలని ప్రయత్నిస్తున్నాడు సునీల్. కానీ అతని సరైన పాత్ర పడడం లేదు. త్రివిక్రమ్ ఇప్పటికి రెండు పాత్రలు ఇచ్చారు కానీ అవి పెద్దగా పండలేదు. డిస్కోరాజా లో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు సునీల్. ఇప్పుడు పవన్ సినిమాలో అతనికి మంచి కామెడీ రోల్ వచ్చినట్లు తెలిసింది. క్రిష్ సినిమాలో కామెడీ లైట్ క్లాస్ టచ్‌తో వుంటుంది. అందువల్ల ఈసారి సునీల్‌కు మంచి పాత్ర వచ్చిందని అనుకోవచ్చు. గతంలో కూడా పవన్‌తో కలిసి సునీల్ మంచి హాస్యాన్ని అందించిన సందర్భాలు ఉన్నాయి. మధ్యలో పవన్‌తో ఆలి ఎక్కువగా చేశారు. మళ్లీ ఇప్పుడు సునీల్‌కు ఛాన్స్ వచ్చింది.













