దర్బార్ లో విలన్ గా బాలీవుడ్ హీరో
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దర్బార్. మురుగదాస్ దర్శకుడు. నయనతార కథానాయిక. ఇటీవలే ముంబయిలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రంలో రజనీకాంత్ ఐపీఎస్ అధికారిగా, సాంఘిక ఉద్యమకారుడిగా రెండు బిన్న కోణాలు కలిగిన పాత్రలో కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్‌శెట్టి నటించబోతున్నారు. రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్ చిత్రం కావడంతో పాటు తన పాత్ర చిత్రణ నచ్చడంతో సునీశ్శెట్టి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారని చెబుతున్నారు. త్వరలో ఆరంభమయ్యే సెకండ్ షెడ్యూల్లో సునీల్‌శెట్టి పాల్గొంటారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి దర్బార్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు













