చిరూ కథతో సందీప్ కిషన్
ఊరి పేరు భైరవకోన సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సందీప్ కిషన్ త్వరలోనే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథను అందించాడు.
అయితే ఇదే కథను అప్పట్లో ప్రసన్న కుమార్ బెజవాడ, కళ్యాణ్ కృష్ణ కోసం చిరంజీవికి ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అదే కథను త్రినాథరావుకు ఇచ్చాడని, కాకపోతే కొత్త వెర్షన్ రాసుకుని పూర్తిగా కొత్త ఫ్లేవర్ ను యాడ్ చేసినట్లు ప్రసన్న కుమార్ చెప్పాడు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ సినిమాను చిరంజీవినే చేసేవాడు.
కానీ భోళా శంకర్ రిజల్ట్ తేడా కొట్టడంతో చిరూ ఇలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకూడదని దీన్ని పక్కన పెట్టేశాడు. ఒకవేళ భోళా హిట్ అయి ఉంటే మాత్రం కచ్ఛితంగా చిరూ ఈ సినిమా చేసి ఉండేవాడు. చిరంజీవి ఒప్పుకున్న కథ అంటే ఏదో బలమైన పాయింట్ ఉండే ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమా చిరూ చేతి నుంచి రావు రమేష్ చేతికొచ్చింది. రావు రమేష్ యంగ్ లో ఉన్నప్పటి పాత్రను సందీప్ కిషన్ పోషిస్తున్నాడు. ధమాకా సినిమా సక్సెస్ తర్వాత దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ సినిమా సక్సెస్ త్రినాథరావు నక్కినకు ఎంతో కీలకం కానుంది.













