దారిలోకి వచ్చిన సందీప్ కిషన్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు 15 ఏళ్లు అవుతున్నా ఇంకా టైర్2 హీరోల రేంజ్ కు కూడా చేరుకోలేకపోయాడు. సందీప్ ఖాతాలో ఎన్ని హిట్లున్నాయని అడిగితే అవి సింగిల్ డిజిట్ లోనే ఉంటాయి. ఇప్పుడిప్పుడే సందీప్ సరైన దారిలో వెళ్తున్నడు. మంచి కథలను ఎంచుకుంటూ సరైన దర్శకులతో సినిమాలు చేస్తున్న సందీప్ కు మంచి ఫలితాలు లభిస్తున్నాయి.
ఊరి పేరు భైరవకోన సినిమాతో రీసెంట్ గా మంచి హిట్ అందుకున్నాడు సందీప్. ఇప్పుడు రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ చిరంజీవి కోసం రాసుకున్న స్టోరీని చిరూ వద్దనుకోవడంతో ఆయన ప్లేస్ లో రావు రమేష్ ను పెట్టి, యంగ్ హీరో పాత్ర కోసం సందీప్ కిషన్ ను సెలెక్ట్ చేసుకోవడం చూస్తే సందీప్ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో అర్థమవుతుంది.
ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించనున్నాడు. ఇది కాకుండా ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాయన్ లో ఓ కీలక పాత్రలో సందీప్ నటిస్తున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ తో ఓ సినిమా, ప్రాజెక్ట్ జెడ్ సీక్వెల్ ను కూడా సందీప్ లాక్ చేసుకున్నాడు. ఇలాగే కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మంచి సినిమాలు చేస్తే సందీప్ కెరీర్ లో దూసుకెళ్లడం ఖాయం.













