ఈ ఏడాది సమ్మర్ సినిమాల బిగ్ బిజినెస్ వేల కోట్లలోనే : రిలీజ్ డేట్స్ ఇవే!
తెలుగు సినిమా స్థాయి గురించి చెప్పాలంటే ఇప్పుడు రాబోయే సినిమాల గురించే మాట్లాడుకోవాలి. టాలీవుడ్ సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేసి వేలకోట్ల బిజినెస్ దిశగా అడుగులేస్తోంది. తెలుగు సినిమా స్థాయి గురించి చెప్పాలంటే ఇప్పుడు రాబోయే సినిమాల గురించే మాట్లాడుకోవాలి. టాలీవుడ్ సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేసి వేలకోట్ల బిజినెస్ దిశగా అడుగులేస్తోంది. పాన్ ఇండియా పేరుతో మొదలైన ఈ ట్రెండ్ తెలుగు సినిమాను ఇండియన్ సినిమాగా మార్చేస్తే.. ఒక్కో సినిమా కోట్ల నుండి వందల కోట్ల వసూళ్లను టార్గెట్ చేస్తుంది. 2021 కరోనా మహమ్మారితో అల్లాడిపోయిన తెలుగు సినిమా వచ్చే 2022 ఏడాదికి వేల కోట్ల బిజినెస్ ను టార్గెట్ చేస్తుంది. దానికి 2022 ఏడాది ఆరంభం నుండే ప్లాన్ మొదలెట్టింది. వచ్చే ఈ ఏడాది సంక్రాంతి కి విడుదల చేయాలనుకున్న భారీ సినిమాలు కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూడా నానా ఇబ్బందులు ఎదుర్కొంది. ఫస్ట్, సెకండ్ వేవ్స్ వల్ల షూటింగ్స్ నిలిచిపోయి, 50 శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇచ్చినా ప్రేక్షకలు థియేటర్లకు వచ్చే సాహసం చెయ్యక.. అనౌన్స్ చేసిన డేట్‌కి సినిమాలు రిలీజ్ చెయ్యలేక నిర్మాతలు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎలా గైతేనేం వాయిదా పడిన సినిమాలన్నీ ఈ సారి పక్క డేట్స్ అధికారికంగా ప్రకటించారు ఆయా సినిమాల యూనిట్స్.
అందులో మొదటిగా తెలుగు సినిమాగా భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న గాని లేదా ఏప్రిల్ 1కానీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు ప్రపంచ చూపు తిప్పేది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఇన్ ఇండియా ఆర్ఆర్ఆర్. ఏప్రిల్ 25న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇందులో టాలీవుడ్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్, శ్రేయ సరన్.. బాలీవుడ్ నుండి అలియా భట్, అజయ్ దేవగన్, హాలీవుడ్ నుండి ఒలీవియా మోరిస్ ఇలా భారీ తారాగణం కనిపించనుంది. ఆర్ఆర్ఆర్ సినిమా బిజినెస్ దాదాపు 500 కోట్లు కాగా.. ఇది ఎంత వసూళ్లు రాబడుతుందనేది ట్రేడ్ పండితులు కూడా అంచనా వేయలేని పరిస్థితి. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 విడుదల చేస్తున్నారు.
ఈ సందర్బంగా … చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివగారు రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రాన్ని కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఫిబ్రవరి రిలీజ్ కాకుండా వాయిదా వేశాం. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1న విడుదల చేయాలని అనుకున్నాం. అయితే ఏప్రిల్ 25న మరో భారీ బడ్జెట్ పాన్ఇండియా మూవీ RRR విడుదలవుతుంది. భారీ అంచనాలున్న రెండు భారీ చిత్రాలు ఇలా తక్కువ గ్యాప్‌లో విడుదల కావడం సరికాదనే భావనతో ఆర్ఆర్ఆర్ నిర్మాతలు మేము సినిమా రిలీజ్ డేట్స విషయంలో చర్చలు జరిపాం. సానుకూల వాతావరణంలో జరిగిన చర్చల కారణంగా ఆర్ఆర్ఆర్ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ అవుతుంది. అలాగే మా ‘ఆచార్య’ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నాం అన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ `సర్కారు వారి పాట` చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా మేకర్లు ఈ మూవీని మే 12న విడుదల చేయబోతోన్నట్టు అధికారికంగా ప్రకటించారు. వేసవి సెలవులను ఈ చిత్రం పూర్తిగా ఉపయోగించుకోనుందని తెలుస్తోంది. సర్కారు వారి పాట మూవీలో మహేష్ బాబును సరికొత్త అవతారంలో చూపించబోతోన్నారు దర్శకులు పరుశురాం. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి మహేశ్ యాక్షన్ సీక్వెన్స్‌లు హైలెట్ కానున్నాయి. ఇక సర్కారు వారి పాట టీం ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది. వాలైంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న సంగీత దర్శకుడు తమన్ అద్భుతమైన రొమాంటిక్ మెలోడి సాంగ్‌ను రెడీ చేశారని తెలుస్తోంది.
ఇక సమ్మర్ సోగ్గాళ్లు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి ఎఫ్ 3 సినిమాతో వేసవికి మూడు రెట్లు వినోదాన్ని అందించబోతోన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 28న విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయింది. ఒక్క సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా రాబోతోన్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ట్రేడ్ వర్గాల్లో ఉన్న క్రేజ్, సినిమా మీద వచ్చిన పాజిటివ్ వైబ్స్ దృష్ట్యా సినిమాకు సంబంధించిన అప్డేట్లతో మేకర్లు అందరినీ ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. ఈ ఏడాది సమ్మర్ సినిమాల రిలీజ్ ని బట్టి ఈ ట్రేడ్.. ఏ ట్రెండ్ లో కొనసాగుతుందో చూడాలి ఉండగా.. ఏది ఏమైనా టాలీవుడ్ పేరు దేశవ్యాప్తంగా మార్మ్రోగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంకా ప్రభాస్ రాధే శ్యామ్, అజిత్ వాలిమై చిత్రాల డేట్స్ ఫైనల్ కావాల్సి వుంది.













