ఏడాది పాటూ రెస్ట్ తీసుకోనున్న సుక్కు
పుష్ప సినిమా మొదలైనప్పటి నుంచి సుకుమార్ ఆ పనుల్లో బిజీగానే ఉన్నాడు. అప్పుడప్పుడు టైమ్ దొరికి బ్రేక్ వచ్చినా ఆ టైమ్ లో కూడా పుష్ప గురించే ఆలోచించాడు తప్పించి రిలాక్స్ మోడ్ లోకి మాత్రం వెళ్లింది లేదు. పుష్ప టీమ్ లో ప్రతి ఒక్కరికీ ఏదొక టైమ్ లో గ్యాప్ దొరికింది కానీ సుకుమార్ కు మాత్రం ఆ గ్యాప్ రాలేదు. వచ్చినా ఆ గ్యాప్ లో కూడా సుకుమార్ సినిమా గురించే ఆలోచిస్తూ పుష్ప జపం చేశాడు.
మొత్తానికి పుష్ప భారీ హిట్ అయింది. నేషనల్ లెవెల్ లో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో పుష్ప2ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించాలని ఎంతో బాధ్యతగా తన పనిని నిర్వర్తిస్తున్నాడు సుక్కూ. కథ విషయంలో ఎన్నోసార్లు ఆలోచించుకుని రివ్యూ చేసుకున్నాకే పుష్ప2 రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాడు. అప్పటినుంచి పుష్ప2 షూటింగ్ జరుగుతూనే ఉంది.
పర్ఫెక్షన్ కోసం సెట్స్ లో కూడా సుకుమార్ పుష్ప2 చెక్కుతూనే ఉన్నాడు. ఎక్కడైనా అవసరమైతే రీషూట్స్ కూడా చేస్తున్నాడు. అవసరమైతే కొత్త వాళ్లను టీమ్ లో చేర్చుకుంటూ పుష్ప2 ని పూర్తి చేసే పనిలో ఎంతో బిజీగా ఉన్నాడు సుక్కు. పుష్ప2 డిసెంబర్ లో రిలీజవుతుంది. సినిమా రిలీజయ్యాక సుకుమార్ ఓ ఏడాది పాటూ సినిమాలకు సంబంధించిన ఎలాంటి పనులు పెట్టుకోకుండా ఏడాది పాటూ రెస్ట్ తీసుకుని ఆ టైమ్ మొత్తాన్ని ఫ్యామిలీకి కేటాయించాలనుకుంటున్నాడని ఆయన సన్నిహితులంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.













