Sukumar: ఓ వైపు చరణ్ సినిమా స్క్రిప్ట్, మరోవైపు నిర్మాణం

పుష్ప(Pushpa) ఫ్రాంచైజ్ సినిమాలతో సక్సెస్ మీద సక్సెస్ అందుకున్న సుకుమార్(Sukumar), ఆ సినిమాలతో తన క్రేజ్ ను సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటుకున్నారు. పుష్ప2(Pushpa2) సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పే పన్లేదు. ఆ సినిమా హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కు, హీరోయిన్ గా రష్మిక మందన్నా(Rashmika Mandanna)కు, డైరెక్టర్ గా సుకుమార్ కు మంచి పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది.
పుష్ప2 కోసం సుకుమార్ ఎన్నో ఏళ్లు కష్టపడగా, ఆ కష్టానికి తగ్గ ఫలితం రావడంతో ఆ సక్సెస్ ను ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఓ వైపు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు డైరెక్టర్ గా రామ్ చరణ్ (Ram Charan)తో చేయబోయే తన తర్వాతి సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. అంతేకాదు, ఇంకోవైపు సుకుమార్ రైటింగ్స్(Sukumar Writings) బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తూ కూడా ఆయన బిజీగా ఉన్నారు.
ఇప్పటికే తన బ్యానర్ లో పలు సినిమాలను నిర్మించిన సుకుమార్, ఇప్పుడు రామ్ చరణ్ తో పెద్ది(Peddi) సినిమా మరియు నాగచైతన్య(Naga Chaitanya)- కార్తీక్ దండు(Karthik Dandu) కాంబినేషన్ లో వస్తున్న సినిమాను కూడా అదే బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇవి కాకుండా పెద్ది తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రానున్న సినిమాకు కూడా సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నారు. ఇవి మాత్రమే కాకుండా మరి కొన్ని సినిమాలను కూడా సుకుమార్ తన బ్యానర్ లో నిర్మించడానికి ఓకే చేశారని తెలుస్తోంది. ఓ వైపు రామ్ చరణ్ మూవీ కోసం స్క్రిప్ట్ వర్క్స్ ను పూర్తి చేస్తూనే మరోవైపు తన బ్యానర్ లో వేరే సినిమాలు నిర్మించడానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఓ వైపు దర్శకుడిగా, మరోవైపు రైటర్ గా సుకుమార్ చాలా బిజీగా ఉన్నట్టు అతని లైనప్ చూస్తుంటే అర్థమవుతుంది.