బాలీవుడ్ భామను దింపనున్న సుకుమార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప1 సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్పకు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని పుష్ప2ను సుకుమార్ మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. సినిమాకు ఎలాంటి ఇబ్బందులెదురైనా పుష్ప2ను ముందు చెప్పినట్లుగా ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తామని సుకుమార్ మేకర్స్ కు హామీ ఇచ్చాడట.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడని టాక్. పుష్పలో ఊ అంటావా సాంగ్ మాదిరే ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ను పెట్టాలని సుకుమార్ బలంగా ఫిక్స్ అయ్యాడట. ఈ సారి పుష్ప2 స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీని దింపనున్నట్లు తెలుస్తోంది.
కల్కి 2898ఏడి కోసం త్వరలో హైదరాబాద్ కు రానున్న దిశా పటానీని ఈ స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలని సుకుమార్ ట్రై చేస్తున్నాడట. సినిమాలో ఐటెం సాంగ్ లేదనే లోటు ఉండకూడదని సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ కు మరో ఐదు నెలలు మాత్రమే టైమ్ ఉండటంతో షూటింగ్ ను త్వరత్వరగా పూర్తి చేసే పనిలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది.













