రీకాప్ను నెక్ట్స్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్న సుకుమార్
ఒకే కథను రెండు భాగాలుగా చేసి రెండు సినిమాలు చేసి చెప్పడాన్ని బాహుబలి సినిమాతో రాజమౌళి స్టార్ట్ చేశాడు. దీంతో ఆ తర్వాత చాలా సినిమాలు ఈ ఫార్మాట్ ను ఫాలో అయ్యి, ట్రెండ్ లో పాల్గొన్నాయి. బాహుబలి1, బాహుబలి2కు చాలానే గ్యాప్ తీసుకున్నాడు రాజమౌళి. దీంతో బాహుబలి2 రిలీజ్ టైమ్ లో థియేటర్ కు వచ్చిన ఆడియన్స్ కు బాహుబలి1 రీకాప్ వేస్తూ ఒక ప్రాణం సాంగ్ ను ప్లాన్ చేశాడు రాజమౌళి.
బాహుబలి ఫస్ట్ పార్ట్ మొత్తాన్ని కేవలం ఒక పాటలో చెప్పాలనుకున్న రాజమౌళి ఆలోచనకు కీరవాణి మ్యూజిక్ తోడై, ఆ సాంగ్ తో పాటూ ఆ సినిమా లీడ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అదే దారిలో వెళ్లిన కెజిఎఫ్2లో కెజిఎఫ్ 1 సినిమాకు సంబంధించి రీ కాప్ కట్ షాట్స్ తో ఫస్ట్ రెండు నిమిషాల్లో చూపించాడు ప్రశాంత్ నీల్.
ఇక ఇప్పుడు పుష్ప2 లో సుకుమార్ ఈ రీకాప్ ను ఎలా ప్లాన్ చేస్తున్నాడా అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువైపోయింది. పుష్ప1 సినిమాలో హై షాట్స్, హై మూమెంట్స్ చాలానే ఉన్నాయి. వాటితోనే పుష్ప2లో పుష్ప1 రీకాప్ ను ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. అది బాహుబలిలా పాటలోనా, కెజిఎఫ్ లాగా రీకాప్ షాట్స్ లోనా అన్నది తెలియదు కానీ పుష్ప2 లో పుష్ప1 రీకాప్ మాత్రం నెక్ట్స్ లెవెల్ లో ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట.













