పుష్ప2 వాయిదా పడేదేలే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప2. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా గతేడాదే రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ లేట్ అవడంతో సినిమాను ఈ ఏడాది ఆగస్ట్ 15కు వాయిదా వేశారు. రిలీజ్ డేట్ కు చాలా టైమ్ ఉండటంతో ఈసారి పుష్ప2 అనుకున్న టైమ్ కు వస్తుందనుకున్నారంతా.
దానికి అనుగుణంగానే షూటింగ్ కూడా చాలా వేగంగా సాగుతోంది. అందరూ పుష్ప2 చెప్పిన టైమ్ కు వస్తుందనుకుంటున్న టైమ్ లో ఎందుకొచ్చిందో, ఎటునుంచి వచ్చిందో కానీ పుష్ప2 వాయిదా పడుతుందని వార్తలొచ్చాయి. పుష్ప2 పోస్ట్ పోన్ అవుతుండటంతో ఆ ప్లేస్ లోకి దేవర వస్తుందని కొందంటే, సరిపోదా శనివారం వస్తుందని మరికొందరు, మరికొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా పుష్ప2 డేట్ పై కన్నేశాయని వార్తలొచ్చాయి.
కానీ ఈసారి పుష్ప2 ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడే ఛాన్స్ లేదని చిత్ర వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 65% పూర్తి అయిందని, వచ్చే మూడు నెలల్లో సినిమా మొత్తాన్ని పూర్తి చేసేలా సుకుమార్ ప్రణాళికలు సిద్ధం చేశాడని తెలుస్తోంది. దీనికోసం వేరు వేరు యూనిట్లను ఏర్పాటు చేసి సుకుమార్ పర్యవేక్షణలో షూటింగ్ ను వేగవంతం చేయనున్నారట. సినిమాను మే లోపు పూర్తి చేసి, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కోసం 45 రోజులను కేటాయించి, జులై నెలాఖరుకల్లా ఫస్ట్ కాపీని రెడీ చేసేలా సుకుమార్ ప్లాన్ చేశాడట.













