Sukumar: రాజమౌళి భయపడిందే జరిగిందిగా
కొన్నేళ్ల కిందట రాజమౌళి(Rajamouli) ఓ ఈవెంట్లో మాట్లాడుతూ సుకుమార్(sukumar) ఎక్కువ క్లాస్ సబ్జెక్టులను డీల్ చేశాడు కాబట్టి సరిపోయింది కానీ ఆయన మాస్ ను సీరియస్ గా తీసుకుంటే తామంతా వెనుకబడిపోతామని చెప్పడం అప్పట్లోనే నెట్టింట వైరల్ అయింది. ఆర్య(Arya) నుంచి నాన్నకు ప్రేమతో(Nannaku Prematho) వరకు సుకుమార్ స్టైల్ ఎక్కువగా అర్బన్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుంటూ వెళ్లింది.
రంగస్థలం(Rangasthalam)తో రూటు మార్చిన సుకుమార్(sukumar) తర్వాత పుష్ప(Pushpa)తో తన మాస్ ను చూపించాడు. ఇప్పుడు పుష్ప2 తో తన మాస్ ఏంటో ప్రపంచానికి తెలియచెప్పాడు. పుష్ప2(Pushpa2) రూ.1000 కోట్ల గ్రాస్ ను దాటడం చూశాక అప్పట్లో రాజమౌళి భయపడిందే సుకుమార్ నిజం చేసి చూపించాడని అందరూ అంటున్నారు. ఒక ఎర్ర చందనం దొంగ కథతో ఆల్ ఇండియా రికార్డులు కొల్లగొట్టడం మామూలు విషయం కానే కాదు.
బడ్జెట్ పరంగా ఎంత ఖర్చయినా ఆ ఖర్చును అంతకు అంత మొత్తం వెనక్కి తీసుకురావడం మామూలు విషయం కాదు. సౌత్ నుంచి నార్త్ ఆడియన్స్ వరకు అందరూ మెచ్చేలా సినిమా తీయడమంటే మాటలు కాదు. దీంతో ఇప్పుడు రాజమౌళికి పోటీగా సుకుమార్ తన స్టామినా ఏంటో అందరికీ తెలియచేసినట్లు అయింది. అయితే రాజమౌళిలా సుకుమార్ తన బ్రాండ్ ను ఇంకా స్ట్రాంగ్ గా రిజిస్టర్ చేసుకుంది లేదు. ఆర్సీ17(RC17) ద్వారా సుకుమార్ తన క్రేజ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లగలగాలి.













