Sukumar: వాళ్లు లేకపోతే నేను లేనంటున్న సుక్కు
సినిమా ఇండస్ట్రీలో ఒకరు చేసిన పనిని తమ పనిగా చెప్పుకుని క్రెడిట్ తీసుకోవాలని చాలా మంది చూస్తుంటారు. డైరెక్టర్లందరూ చాలా మంది రచయితలను పెట్టుకుని వర్క్ చేయించుకుంటారు కానీ ఆఖరికి రైటింగ్ క్రెడిట్ మొత్తం వాళ్లే తీసుకుంటారు. వర్క్ చేసిన వారికి క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు వారికి సరైన రెమ్యూనరేషన్ కూడా ఇవ్వరు.
ఇలాంటి జనాల మధ్య డైరెక్టర్ సుకుమార్(Sukumar) మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తాడు. ఆయన సినిమాల్లో ఒరిజినాలిటీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పన్లేదు. సుకుమార్ కూడా అందరిలానే ఎంతోమంది రైటర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లను పెట్టుకుని వర్క్ చేస్తారు. కానీ సినిమాలో మాత్రం ప్రతీ చోటా సుకుమార్ మార్కే కనిపిస్తుంది.
అలా అని సుకుమార్ తన సినిమాలకు మొత్తం క్రెడిట్ తనే తీసుకోడు. రైటింగ్ క్రెడిట్స్ తో పాటూ తన దగ్గర పనిచేసే అందరికీ తగిన రెమ్యూనరేషన్ అందేలా చూస్తాడు. వీటితో పాటూ సక్సెస్ మీట్ లో తన టీమ్ మొత్తాన్ని స్టేజ్ పైకి పిలిచి మరీ అభినందిస్తాడు. పుష్ప2(Pushpa2) సక్సెస్ మీట్ లో సుక్కు తన టీమ్ లోని ఒక్కొక్కరి గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన టీమ్ లోని ఒక్కొక్కరు ఒక్కో సుకుమార్ అని, వాళ్లు లేకుంటే తాను లేనని సుకుమార్ అందరి ముందు చెప్పడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం.













