సుజిత్ తో సినిమా.. క్లారిటీ ఇచ్చిన నాని
సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్న నటుడు నేచురల్ స్టార్ నాని. గతేడాది దసరా లాంటి ఊరమాస్ సినిమాతో ఆడియన్స్ ను మెప్పించిన నాని, ఆ తర్వాత హాయ్ నాన్న అనే క్లాస్ సినిమాను తీసి మరో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే క్లాస్, మాస్ కలిపి ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నాడు.
అయితే మొన్నటివరకు నాని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో గందరగోళం ఉండేది. బలగం వేణుతో చేయాల్సిన సినిమా ఆగిపోయింది. ఓజి డైరెక్టర్ సుజిత్ తో చేయాల్సిన సినిమా ఉంటుందా లేదా అనే డౌట్స్ నెలకొన్నాయి. ఇప్పుడు నాని లైనప్ పై పూర్తి క్లారిటీ వచ్చేసింది. నాని తన తర్వాతి సినిమాను శ్రీకాంత్ ఓదెలతో చేయనున్నాడు. దీంతో పాటూ హిట్3 ని కూడా నాని సమాంతరంగా చేయనున్నాడు.
వీటికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్స్ సెప్టెంబర్ మొదటి వారంలో రానున్నాయి. అంతేకాదు నాని రీసెంట్ గా సుజిత్ సినిమాకు సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చాడు. సుజిత్ తో తన సినిమా ఉంటుందని, ఫ్యాన్స్ ఎప్పట్నుంచో తనను చూడాలనుకుంటున్న పవర్ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే ఓజి తర్వాత సుజిత్ చేయబోయే ప్రాజెక్ట్ నానితోనే అని అర్థమవుతుంది. నాని, సుజిత్ కలిసి సినిమా చేస్తే నాని మార్కెట్ మరింత పెరగడం ఖాయం.













