ఆ ధైర్యమే సుజిత్‌ను ఇలా నిలబెట్టింది
ఏ యంగ్ డైరెక్టర్‌కైనా సరే ఓ పెద్ద స్టార్ హీరో నుంచి మూవీ ఆఫర్ వస్తే ఆలోచించకుండా చేసేస్తారు. కానీ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ మాత్రం అలా కాదు. గతంలో చిరంజీవి లూసిఫర్ రీమేక్ చేయాలని డిసైడైనప్పుడు మొదట ఆ ఆఫర్ సుజిత్‌కే వెళ్లింది. కొన్ని రోజులు స్క్రిప్ట్ పై వర్క్ చేశాక ఆ సబ్జెక్ట్ ను తను హ్యాండిల్ సున్నితంగా చెప్పేసి బయటకు వచ్చేశాడు. తర్వాత ఆ సినిమా మోహన్ రాజా దగ్గరకు వెళ్లింది.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసే ఛాన్స్ వచ్చినప్పుడు కూడా సుజిత్ ముందు రీమేక్ ప్రతిపాదనే పెట్టాడట. కానీ పవన్ ఏదైనా మంచి కథ ఉందా అని అడగ్గానే సుజిత్ వెంటనే ఏ మాత్రం తొణక్కుండా ఓజీ స్టోరీ చెప్పడం, అది పవన్ కళ్యాణ్ కు బాగా నచ్చి వెంటనే ఓకే చేయడం, సినిమా సెట్స్ కు వెళ్లడం జరిగిపోయాయి. ఆ రోజు సుజిత్ రిస్క్ చేసి పవన్ కు చెప్పిన ఓజి కథనే తనను ఇవాళ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మార్చింది.
పవన్ చేస్తున్న సినిమాల్లో అన్నింకటికంటే ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమా ఓజీనే. రీసెంట్ గా కార్తికేయ భజే వాయువేగం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజిత్ ఈ విషయాన్ని తెలిపాడు. ఏపీ ఎలక్షన్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పిన సుజిత్, జూన్ నుంచి ఓజీ కొత్త షెడ్యూల్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఏదేమైనా ఓజీ టీమ్ చెప్పినట్లు సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కావాలంటే పవన్ సెట్స్ లోకి అడుగుపెట్టే డేట్ ను బట్టే ఆధారపడి ఉంటుంది.













