సుజిత్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో మొత్తం మూడు పూర్తి చేయాల్సిన సినిమాలున్నాయి. వాటిలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజి కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ డేట్ ను సెప్టెంబర్ 27 అని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ హడావిడిలో ఉన్న పవన్ కళ్యాణ్, ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే ఓజికి కాల్షీట్స్ ఇవడ్డానికి ఓకే అన్నాడట.
ఈ సినిమాకు కరెక్ట్ గా 40 రోజులు డేట్స్ ఇస్తే సినిమా మొత్తం పూర్తి చేస్తానని సుజిత్ చాలా ధీమాగా చెప్పడం వల్లే మేకర్స్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక్కడ సుజిత్ ప్లానింగ్ ను మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి టీజర్ వచ్చే వరకు సుజిత్ తీసుకున్న జాగ్రత్తలే ఈ సినిమాకు హైప్ ను తెచ్చి పెట్టాయి.
ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఒక ఫ్యాన్ గా తాను పవన్ ను ఎలా అయితే చూపించాలనుకున్నాడో దానికంటే ఎక్కువగానే పవన్ స్క్రీన్ పై కనిపిస్తాడని ఇప్పటికే మేకర్స్ చెప్తున్నారు. సుజిత్ చేతిలో ఇంకా 7 నెలల టైముంది. ఎలక్షన్స్ కోసం మూడు నెలలు వదిలేసినా ఇంకో నాలుగు నెలలుంటుంది. ఈ నాలుగు నెలల్లో పవన్ తో షూటింగ్ 40 రోజులు మాత్రమే. మిగిలిందంతా పోస్ట్ ప్రొడక్షన్ కోసమే. ఇప్పటివరకు షూటింగ్ జరిగిన భాగానికి తమన్ రీరికార్డింగ్ చేస్తున్నాడట. ఇదంతా చూసి, సుజిత్ ప్లానింగ్ మామూలుగా లేదు అనకుండా ఉండలేం.













