సబితా ఇంద్రారెడ్డిగా సుహాసిని!
మాజీ సీఎం వై.ఎస్.రాజశేఖర్రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కబోతోంది. మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో ఎవరు నటిస్తారనే దానిపై సృష్టత రాలేదు. కీలక పాత్రల్లో సీనియర్ ఆర్టిస్టుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా వైఎస్ మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా పనిచేసిన సబిబా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని నటించే అవకాశం ఉందట. సబిబా ఇంద్రారెడ్డి పాత్రకు సుహాసిని బాగి సరిపోతారని చిత్ర బృందం భావించి, ఆమెను సంప్రదించగా సుహాసిని సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు వైఎస్ సతీమణి విజయమ్మ పాత్రలో బాహుబలి 2 ఫేమ్ ఆశ్రిత పొన్నగంటి, కూతురు షర్మిలా పాత్రలో భూమిక, పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి నటించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్టైన్మెంట్ పతాపంపై విజయ్ చిల్లా, శశిదేవ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.













