సుహాస్ ఆలోచించాల్సిన టైమొచ్చింది
భిన్నమైన కథలను ఎంచుకుంటాడనే పేరున్న సుహాస్(Suhas) కు గత కొన్ని సినిమాలుగా ఏం కలిసి రావడం లేదు. రీసెంట్ గా తన నుంచి వచ్చిన జనక అయితే గనక(Janaka ayithe ganaka) ఆశించిన ఫలితాన్నివ్వలేదని కలెక్షన్స్ చెప్తున్నాయి. విశ్వం(Viswam), మా నాన్న సూపర్ హీరో(maa nanna super hero) కంటే ఈ సినిమాకే మంచి రేటింగ్స్ వచ్చాయి. కానీ కలెక్షన్స్ మాత్రం రావడం లేదు.
దసరా లాంటి పండగల సీజన్ లో కూడా సుహాస్ మూవీ ఎలాంటి ఎఫెక్ట్ చూపించకపోవడం విశేషం. అయితే వినే పాయింట్ లో క్రియేటివిటీ ఉండే కంటే దాన్ని తెరపై సమర్థవంతంగా చూపించే డైరెక్టర్ లేకపోవడం వల్లే సుహాస్ యావరేజ్ లేదా ఫ్లాపులు పడుతున్నాయి. ప్రసన్నవదనం(Prasanna vadanam) సినిమాలోని బ్యాక్ డ్రాప్ ను ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయలేదు.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్(Ambaji peta marriage band) కోసం ఏకంగా గుండు కూడా కొట్టించుకున్నాడు సుహాస్. పాత్ర నచ్చడం వల్ల తన నిడివి చూసుకోకుండా శ్రీరంగ నీతులు(Sriranga neethulu) సినిమా చేశాడు. ఒక జంతువుపై టైటిల్ పెట్టినా వెరైటీగా ఉందని గొర్రె పురాణం(Gorre puranam)ను చేశాడు. వీటిలో ఒకటి మినహా మిగిలినవన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినవే. వరుస ఫ్లాపులు సుహాస్ సినిమాల ఓపెనింగ్స్ పై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం అతని చేతిలో కేబుల్ రెడ్డి(Cable reddy), ఉప్పు కప్పురంబు(Uppu kappurambu), ఆనందరావు అడ్వెంచర్స్(Anandarao Adventures) ఉన్నాయి. వీటిలో ఏదైనా మంచి హిట్ అయితే సుహాస్ తిరిగి ట్రాక్ లో పడే ఛాన్సుంది.













