కొత్తగా ట్రై చేస్తున్న సుహాస్
లో బడ్జెట్ సినిమాలకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్. రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజి బ్యాండు తో కమర్షియల్ గా గట్టెక్కిన సుహాస్ ఇంతకుముందు రైటర్ పద్మభూషణ్ సినిమా ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన విషయం తెలిసిందే. ఇకపతే సుహాస్ త్వరలోనే ప్రసన్న వదనం అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు.
తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటూనే అంచనాలు పెంచుతుంది. అర్జున్ వైకె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ గా రూపొందుతుంది. ఫేస్ బ్లైండ్ నెస్ అనే పాయింట్ ను సినిమాలో తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఈ సమస్య ఉన్న వారు చుట్టూ అన్నీ స్పష్టంగా ఉన్నా సరే ఎదురుగా ఉండే వ్యక్తులను పోల్చుకోలేరు.
దీనికి క్రైమ్, లవ్ అంశాలను జోడించి కొత్తగా ట్రై చేసినట్లనిపిస్తుంది. నిజానికి ఇలాంటి టైమ్ లో సుహాస్ కు కావాల్సింది ఇలాంటి ప్రయోగాలే. రొటీన్ ఫార్ములా సినిమాలు చేసే స్థాయి ఇంకా సుహాస్ కు రాలేదు. ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించాలంటే కొత్తగా అనిపించే కంటెంట్ తప్ప తనకు మరో దారి లేదు. అలా అని ఆడియన్స్ కు కనెక్ట్ కాని సబ్జెక్ట్స్ ను తీసుకున్నా కూడా కష్టమే. ప్రసన్న వదనం సినిమాతో పాటూ సుహాస్ చేతిలో గొర్రె పురాణం, శ్రీరంగ నీతులు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.













