సైలెంట్ అయ్యి సుహాస్ మంచి పనే చేశాడు
కెరీర్ స్టార్టింగ్ లో అవకాశాలొస్తున్నాయని తొందరపడి ఒప్పేసుకుంటే ఆ ఎఫెక్ట్ తర్వాత ఎంత ఉంటుందో తెలియక చాలా మంది తప్పులు చేస్తుంటారు. ఈ విషయంలో టాలెంటెడ్ యాక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అంతే సంగతులు. టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్(Suhas) కు ఇప్పుడిదే అనుభవమవుతోంది.
దేవర(Devara) సినిమా హడావిడిలో కనిపించలేదు లేదు కానీ మొన్న గొర్రె పురాణం(Gorre Puranam) రిలీజైన విషయం చాలా మందికి తెలియదు. అసలు ఆ సినిమా వచ్చిందనే విషయమే ఎవరికీ తెలియలేదంటే అర్థం చేసుకోవచ్చు సినిమా పరిస్థితి ఏంటనేది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా సుహాస్ ఎక్కడా కనిపించలేదు. సినిమా కథ కొత్తగా ఉన్నప్పటికీ దాన్ని చెప్పే క్రమంలో తడబాటు స్పష్టంగా కనిపించడంతో ఆడియన్స్ కు సినిమా పెద్ద తలనొప్పిగా మారింది.
ఓపెనింగ్స్ రావడం పక్కన పెడితే కనీస టాక్ కూడా లేదు. మొన్నామధ్య వచ్చిన శ్రీరంగ నీతులు(Sri Ranga Neethulu) సినిమాకు సైతం సుహాస్ కు ఇదే అనుభవం ఎదురైంది. దీంతో దసరాకు రానున్న జనక అయితే గనక(JanakaAyitheGanaka) సినిమాపై సుహాస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఓవర్సీస్ సినిమా రైట్స్ ను తనే సొంతంగా కొన్నాడంటే తన నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా విషయంలో కాన్ఫిడెంట్ గా ఉండటం వల్ల గొర్రె పురాణం లాంటి సినిమా జోలికి వెళ్ళకుండా జాగ్రత్త పడ్డాడో లేక మరేమైనా కారణముందో తెలియదు కానీ సుహాస్ మాత్రం ఆ సినిమాకు దూరంగా ఉండి మంచి పనే చేశాడని నెటిజన్లు భావిస్తున్నారు.













