సుహాస్ తో కలిసి నటించనున్న మహానటి
షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి నేషనల్ అవార్డు మూవీ కలర్ ఫోటోలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. ప్రస్తుతం అతని మార్కెట్ రోజురోజుకీ పెరుగుతుంది. గతేడాది రైటర్ పద్మభూషణ్‌తో మంచి హిట్ అందుకున్న సుహాస్, రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజీబ్యాండుతో మరో సక్సెస్ అందుకున్నాడు.
త్వరలోనే సుహాస్ నుంచి ప్రసన్న వదనం, గొర్రె పురాణం, శ్రీరంగనీతులు, ఆనందరావు అడ్వెంచర్స్ సినిమాలు రానున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సుహాస్ కు జోడీగా కీర్తి సురేష్ నటించనుండటం విశేషం. మొన్నటివరకు స్టార్ల సరసన నటించిన కీర్తి, నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలు రావాలే కానీ ఆలోచించకుండా ఓకే అనేస్తుందన్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే ఉప్పు కప్పురంబు సినిమా చేస్తోంది. ఈ సినిమా థియేటర్ మూవీ కాదు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం నిర్మిస్తున్న సినిమా. అనిల్ ఐవి శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రీసెంట్ గా ప్రైమ్ ఈవెంట్ లో భాగంగా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ ఈవెంట్ కు సుహాస్ అటెండ్ అయ్యాడు కానీ డేట్స్ ప్రాబ్లమ్ వల్ల కీర్తి రాలేకపోయింది. ఒకరకంగా సుహాస్ కు ఇది ప్రమోషన్స్ లాంటిదే. పేరున్న హీరోయిన్లతో నటించడం వల్ల కచ్ఛితంగా తన ఇమేజ్ పెరగడం ఖాయం.













