Suhas: ఈ రెమ్యూనరేషన్ గోలేంటి అసలు?
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సుహాస్(Suhas) నటుడిగా తనకంటూ గుర్తింపు అందుకున్నాడు. ఓ వైపు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోవైపు హీరోగా నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న సుహాస్ కెరీర్ మొదలుపెట్టినప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లో నటించాడు. కలర్ఫోటో(Color photo) సినిమా మంచి హిట్ అవడంతో సుహాస్ హీరోగా సినిమాలు తీయడానికి పలువురు నిర్మాతలు రెడీ అయ్యారు.
ప్రస్తుతం సుహాస్ హీరోగా ఓ భామ అయ్యో రామా(O Bhama Ayyo Rama) అనే సినిమా తెరకెక్కుతుంది. రామ్ గోదాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక మనోజ్(Malavika Manoj) హీరోయిన్. రీసెంట్ గానే రిలీజైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా సుహాస్ కు మీడియా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది.
మీరు యాడ్ కోసం ఎంత పారితోషికం తీసుకుంటారో సినిమాలకు కూడా అంతే తీసుకుంటారని బయట టాక్ ఉంది. ఈ విషయంపై మీరెలా స్పందిస్తారని ఓ జర్నలిస్టు సుహాస్ ను అడగ్గా, అసలు నాకు ఇదేం టార్చర్ అంటూ సుహాస్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. అయినా నా యాక్టింగ్ బావుందనో బాలేదనో కామెంట్ చేయకుండా ఈ రెమ్యూనరేషన్ గోలేంటని సుహాస్ అన్నారు.













