మళ్లీ బుల్లితెరపైకి సుధీర్
బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. ఈ పేరు వింటే ఆడియన్స్ మొత్తం ఊగిపోతారు. బుల్లి తెరపై సుధీర్ సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్ తోనే సుధీర్ సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులేసి హీరోగా మారాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ తో హీరోగా అరంగేట్రం చేసిన సుధీర్ ఆ తర్వాత వాంటెడ్ పండుగాడు, గాలోడు, కాలింగ్ సహస్ర అనే సినిమాలు చేశాడు.
కానీ సుధీర్ చేసిన ఆ సినిమాలేవీ అనుకున్న ఫలితాన్నివ్వలేదు. అతను చేస్తున్న సినిమాలు ఎప్పుడు రిలీజవుతున్నాయి ఎప్పుడు థియేటర్ల నుంచి వెళ్లిపోతున్నాయనేది కూడా తెలియకుండా పోయింది. బుల్లితెరపై చేసిన ప్రతీ షో ను పెద్ద హిట్ చేసిన సుధీర్, సిల్వర్ స్క్రీన్ పై మాత్రం ఆ హిట్ ను అందుకోలేకపోయాడు.
దీంతో ఇప్పుడు సుధీర్ మళ్లీ స్మాల్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నాడు. తనకకు లైఫ్ ఇచ్చిన ఈటీవీ కోసం ఫ్యామిలీ స్టార్స్ అనే ప్రోగ్రాం చేస్తున్నాడు సుధీర్. రీసెంట్ గానే దానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజైంది. మొత్తానికి సుధీర్ స్మాల్ స్క్రీన్ ఎంట్రీ అతని ఫ్యాన్స్ కు మంచి సర్ప్రైజ్ ను ఇచ్చింది. అయితే బుల్లి తెరపైకి వచ్చాడని సుధీర్ సినిమాలకు దూరంగా ఉంటాడా అంటే అదేమీ లేదు. స్క్రీన్ ఏదైనా సరే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమే తన టార్గెట్ అంటున్నాడు సుధీర్.













