సుడిగాలి పాటలు విడుదల
వెంకటేశ్ గౌడ్, ప్రాచీ అధికారి, అభయ్ కులకర్ణి, మమత ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ సుడిగాలి. రమేశ్ అంకం దర్శకుడు. చెట్టుపల్లి వెంకటేశ్, బిరాదర్ మల్లేశ్ నిర్మాతలు. ర్యాప్రాక్ షకీల్ సంగీత దర్శకుడు. ఈ చిత్రంలోని పాటలను ఎంఎల్‌సి రాములు నాయక, నిర్మాత సాయివెంకట్ విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ సుమన్‌గారు కీలక పాత్రలో అద్భుతంగా నటించారు. సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు.













